BIKKI NEWS (OCT. 11) : One man committee on sc reservations with Shamim Akthar. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ షమీమ్ అక్తర్‌ను కమిషన్ చైర్మన్‌గా ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. ఉపకులాల వారీగా ఎస్సీల వెనుకబాటుతనాన్ని కమిషన్ అధ్యయనం చేయనుంది.
One man committee on sc reservations with Shamim Akthar
ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెకలను పరిగణనలోకి తీసుకొని, ఏకసభ్య కమిషన్ 60 రోజుల్లో నివేదిక సమర్పించాలని గడువు నిర్దేశించారు. కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అన్ని విభాగాల నుంచి అందేలా చూడాలని సీఎస్‌కు సూచించారు.
మంత్రివర్గ ఉప సంఘానికి అందిన వినతులపైనా సమావేశంలో చర్చించడంతోపాటు, వాటన్నింటినీ ఏకసభ్య కమిషన్‌కు అందించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయి నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదుల స్వీకరణకు ఉమ్మడి పది జిల్లాల్లో ఒకోరోజు పర్యటించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.