DAILY GK BITS IN TELUGU 18th JUNE
1) వాతాపికొండ అనే బిరుదు గల రాజు ఎవరు.?
జ : నరసింహ వర్మన్
2) హఫ్ లయన్ అను పుస్తకం ఎవరి గురించి రాయబడింది.?
జ : పీవీ నరసింహారావు
3) ఆధునిక మెడిసిన్ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : హిప్పో క్రటిస్
4) అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : క్రిస్టినా కోచ్
5) టెలివిజన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : జాన్ లోగి బయర్డ్
6) కంప్యూటర్ తనలో సమాచారం ను ఏ విధంగా నిక్షిప్తం చేస్తుంది.?
జ : శూన్యము (1) మరియు ఒకట్లు (1)
7) నిజాం కాలంలో కొత్వాల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (కోత్వాల్) గా నియమితులైన మొదటి హిందూ ఎవరు.?
జ : వెంకట్రామిరెడ్డి
8) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మొదటిసారి తెలుగులో (1955) ఏ గ్రంధానికి ఇచ్చారు.?
జ : ఆంధ్రుల సాంఘిక చరిత్ర (సురవరం ప్రతాపరెడ్డి)
9) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
జ : 1938
10) 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారి నుండి స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదును పొందిన నిజాం రాజు ఎవరు?
జ : అఫ్జల్ ఉద్దౌల (5వ నిజాం)
11) తెలంగాణలో తొలి ఇంటర్నెట్ సదుపాయం పొందిన గ్రామం ఏది.?
జ : సిద్దాపూర్
12) ఇండియన్ అరోరా గ్రానైట్ కు ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది.?
జ : నిజామాబాద్
13) హైదరాబాదులోని చౌ మహళ్లా ప్యాలెస్ ను యునెస్కో చారిత్రక కట్టడాల జాబితాలో ఏ సంవత్సరంలో చేర్చింది.?
జ : 2010
14) శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం తెలంగాణలో ఏ ప్రాంతంలో కలదు.?
జ : ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో
15) 1793లో భారత దేశంలో జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టినది ఎవరు.?
జ : కారన్ వాలిస్
DAILY GK BITS IN TELUGU 18th JUNE