BIKKI NEWS (FEB. 20) : LRS REGISTRATION IN TELANGANA. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంలో బాగాన గత నాలుగేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫ్లాట్లకు కూడా LRS దరఖాస్తుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
LRS REGISTRATION IN TELANGANA
మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకున్న వారికి 25% రాయితీని కూడా కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం విశేషం.
ఈ మేరకు సమీక్ష నిర్వహించిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి, దుద్దిల్ల శ్రీధర్ బాబులు తాజా ఆదేశాలు జారీ చేశారు
అనుమతి లేని లేఅవుట్లలో ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ లను గత ప్రభుత్వం నిషేధించింది. దీంతో నాలుగేళ్లుగా ఆ లేఔట్లలో ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు వాటికి కూడా మోక్షం లభించనుంది.
అక్రమ లేఅవుట్ లో 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయితే మిగతా 90% ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్ అవకాశాన్ని కల్పిస్తారు.
సబ్ రిజిస్టార్ ఆఫీసుల వద్దే ఎల్ఆర్ఎస్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని, అక్కడే ఫీజు చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th