హైదరాబాద్ (జూలై – 14) : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు నూతన పెన్షన్ విధానం (NPS) లో పని చేస్తున్న ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులకు పాత పెన్షన్ (GPF) పొందడానికి అవకాశం కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. (NPS to OPS OPTION CHANCE TO EMPLOYEES GIVEM BY UNION GOVERNMENT)
2004 జనవరి – 01 తర్వాత నియమితులైన వారికి నేషనల్ పెన్షన్ సిస్టం (NPS) ప్రకారం నూతన పెన్షన్ విధానం అమలవుతుంది. అయితే సదరు ఉద్యోగులకు పాత పెన్షన్ (GPF) విధానంలోకి మారడానికి ఒకసారి అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ మరియు డెత్ బెనిఫిట్లను పాత పెన్షన్ విధానం (జిపిఎఫ్) లో పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 31 వరకు అవకాశం కల్పించారు.