BIKKI NEWS : భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి 2021కి గాను (NOBEL PHYSICS 2021) స్యుకురో మనాబె, క్లాస్ హాసెల్మాన్, గియోర్గియో పారిసిలను ఫిజిక్స్ నోబెల్ ఇస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.
నోబెల్ బహుమతితోపాటు ఇచ్చే ప్రైజ్‌మనీలో సగం పారిసికి, మిగతా సగం మానబె, హాసెల్మాన్ లకు ఇవ్వనున్నట్లు అకాడమీ తెలిపింది.
ఈ ఏడాది ఫిజిక్స్ నోబెల్ గెలిచిన పారిసి.. క్రమరహిత సంక్లిష్ట పదార్థాలలో దాగి ఉన్న నమూనాలను కనుగొన్నారు.
ఇక మనుషుల కారణంగా ఉత్పన్నమవుతున్న కార్బన్ డై ఆక్సైడ్ వల్లే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని క్లాజ్ హాసెల్‌మాన్‌ను కనుగొన్నారు. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ స్థాయులు పెరిగిన కొద్దీ భూ ఉపరితల ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతున్నాయో నిరూపించిన స్యుకురో మనాబెను కూడా ఈసారి ఫిజిక్స్ నోబెల్‌కు ఎంపిక చేశారు.
★ స్యుకురో మనాబె :: జపాన్‌లోని షింగు నగరంలో 1931లో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో నుంచి 1957లో ఆయన పీహెచ్డీ పొందారు. అమెరికాలోని ప్రిన్స్‌స్టన్ యూనివర్సిటీలో సీనియర్ మెటిరాలాజిస్ట్‌గా చేస్తున్నారు
★ క్లాస్ హాసెల్మాన్ :: జర్మనీలోని హాంబర్గ్‌లో 1931లో పుట్టారు. జర్మనీలోని గొట్టిన్‌జెన్ వర్సిటీ నుంచి 1957లో పీహెచ్డీ పూర్తి చేశారు. హాంబర్గ్‌లో ఉన్న మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటిరాలజీలో ప్రొఫెసర్‌గా చేస్తున్నారు.
★ గియోర్గియో పారిసి :: ఇటలీ దేశంలోని రోమ్‌లో 1948లో జన్మించారు. రోమ్‌లో ఉన్న సెపింజా యూనివర్సిటీ నుంచి 1970లో ఆయన పీహెచ్డీ పూర్తి చేశారు. సెపింజా వర్సిటీలోనే ప్రొఫెసర్‌గా చేశారు.