NITWAA – పూర్వ విద్యార్థుల సదస్సు

BIKKI NEWS (FEB. 17) : ఫిబ్రవరి 16న , నిట్ వరంగల్ పూర్వ విద్యార్థుల విభాగం, NITWAA అధ్వర్యంలో నిట్ సెమినార్ హాల్ లో విద్యార్థులకు అవగాహన సదస్సును మరియు నిట్వా -24 కేలెండర్ ఆవిష్కరణ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి మరియు హన్మకొండ కలెక్టర్ శ్రీమతి సిక్తా పట్నాయక్ హాజరయ్యారు.

అయోధ్య రామాలయ పునాది నిర్మాణంలో కాకతీయులు వాడిన సాండ్ బాక్స్ సాంకేతికత అంశంపై నిట్ విశ్రాంత ప్రొఫెసర్ పాండు రంగారావు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాకతీయుల దార్శనికత, శిల్పాకళా నైపుణ్యత గొప్పతనముతో రామప్ప ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించబడిందన్నారు.

అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రొఫెసర్ మురళి దర్శన్ (విశ్రాంత డైరెక్టర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ న్యూ ఢిల్లీ) మాట్లాడుతూ ప్రపంచకీకరణ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య రంగంలో గల అవకాశాలను గురించి, పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కావాల్సిన మెలకువలను గురించి మాట్లాడారు.

అనంతరం నిట్ వరంగల్ అలమ్ని చాప్టర్ వారి కేలండర్ 2024 ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
ముఖ్య అతిధి బిద్యాధర్ సుబుద్ధి మాట్లాడుతూ వరంగల్ అలమ్ని చాప్టర్ అధ్యక్ష్యులు ఇంజనీర్ చంద్రగిరి శ్రీనివాస్ నేతృత్వంలో చేపడుతున్న పలు విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలను అభినందించారు.

కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సామాజిక భాద్యత కలిగిన సాంకేతిక శాస్రవేత్తలను రూపొందించడంలో నిట్ వరంగల్ అగ్రస్థానంలో ఉన్నదని కొనియాడారు.

చంద్రగిరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిట్ అంతర్జాతీయ విభాగం డీన్ రామశేషు, అలమ్ని సలహాదారుడు ప్రో. పులి రవికుమార్ , ప్రొఫెసర్లు వేణు వినోద్, శ్రీనాధ్, రాహుల్, హీరాలాల్, రవీందర్ రెడ్డి, అలమ్ని కార్యవర్గ సభ్యులు ఇంజనీర్ సత్యనారాయణ, ప్రకాష్ చారి, ఆనందం, సురేష్, సదానందం, సురేందర్, సర్దార్ ఓంకార్ సింగ్ మరియు పరిశోధక మరియు పిజి, యమ్ బి ఏ విద్యార్థులు పాల్గొన్నారు.