BIKKI NEWS (NOV 26) : జాతీయ శ్వేత విప్లవ పితామహుడు డాక్టర్ వర్గీస్ కురియన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 26 న జాతీయ పాల దినోత్సవాన్ని (national milk day on birth anniversary of dr Verghese Kurien) జరుపుకుంటారు.
డాక్టర్ వర్గీస్ కురియన్ శ్వేత విప్లవాన్ని తీసుకు వచ్చారు. మరియు డైరీ ఫారమ్‌ను భారతదేశంలో అతిపెద్ద స్వయం – స్థిర పరిశ్రమగా మార్చారు. అతను చేసిన కృషిని గౌరవించేందుకు నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవాన్ని జరుపుకుంటాం.
ఈ సందర్భంగా డెయిరీ రంగంలోని విశేష కృషి చేస్తున్న వారికి మూడు కేటగిరీలలో జాతీయ గోపాల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.
★ శ్వేత విప్లవం (Operation Flud)
ప్రపంచంలోని విస్తృతమైన వ్యవసాయ కార్యక్రమం ఆపరేషన్ ఫ్లడ్‌కు నాయకత్వం వహించడం ద్వారా డాక్టర్ కురియన్ భారతదేశంలో శ్వేత విప్లవ పితామహుడిగా పరిగణించబడ్డారు. అతని కృషితో 1970 జనవరి 13న ఆపరేషన్ ఫ్లడ్ ప్రారంభమైంది. అలాగే 1998లో ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించింది. పావ ఉత్పత్తి దారులకు, వినియోగదారులకు అనుసంధానం కల్పించి ఉభయులకు గిట్టుబాటు ధరలో స్వచ్ఛమైన పాలను అందించడమే శ్వేత విప్లవ లక్ష్యం.
అప్పటి వరకు అసంఘటితంగా తమ సొంత కుటుంబ అవసరాలకే పాల ఉత్పత్తిని భారతీయ గ్రామీణ రంగ వ్యవసాయదారులు చేసేవారు. ఈ సమయంలో కురియన్ కృషితో రైతులు సంఘటితంమై డెయిరీ లను ఏర్పాటు చేసుకుని పాలను వ్యాపారాత్మకంగా ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు ముఖ్య పరిశ్రమగా పాల ఉత్పత్తి నిలబడి అదనపు ఆర్థిక దన్నుగా శ్వేత విప్లవం నిలిచింది.
★ కురియన్ – అవార్డులు
డాక్టర్ కురియన్‌కు రామన్ మెగసెసే అవార్డు, ప్రపంచ ఆహార బహుమతి మరియు కృషి రత్న వంటి అనేక గౌరవాలు లభించాయి.
అతను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్‌లను కూడా అందుకున్నాడు.