Home > EDUCATION > AUTHENTIC – 2023 అన్లైన్‌లో అత్యధికులు వెదికిన పదం.

AUTHENTIC – 2023 అన్లైన్‌లో అత్యధికులు వెదికిన పదం.

హైదరాబాద్ : 2023 లో అత్యధికులు అన్వేషించిన పదం ‘అథెంటిక్’ (Most searching word in 2023 is Authentic) అని మెరియం వెబ్స్టర్ నిఘంటు కంపెనీ సోమవారం ప్రకటించింది. దీనికి ‘నిజమైన, విశ్వసనీయమైన, ప్రామాణికమైన అని అర్థం. ప్రస్తుత కృత్రిమ మేధా జనిత DEEP FAKE ప్రపంచంలో విశ్వసనీయత సంక్షోభంలో పడింది. అందుకే జనం తమ ఆన్లైన్ నిఘంటువులో నిజమైన వంటలు, నిజమైన స్వరం, నిజ స్వరూపం కోసం వెతుకులాటను ముమ్మరం చేశారని నిఘంటు సంపాదకుడు పీటర్ సోకొలోవ్ స్కీ వివరించారు.

మెరియం వెబ్స్టర్ ఆన్లైన్ నిఘంటువులో 5 లక్షల పదాలు ఉండగా, వాటిలో లవ్ అనే పదానికి అర్థం అన్వేషించేవారు ఎప్పుడూ అత్యధికంగా ఉంటారు. అది రివాజు కూడా. మరోవైపు.. ఈ సంవత్సరం అథెంటిక్ అనే పదం టాప్ లో నిలిచిందని చెప్పారు.

సాంకేతిక సాయంతో తన ఫొటోలను అసభ్యంగా మార్చి ప్రచారంలో పెట్టడాన్ని `డీప్ ఫేక్ అని అంటారు. 2023లో ప్రపంచం ఆన్లైన్లో వెతికిన పదాల్లో డీప్ ఫేక్ ఒకటని మెరియం వెబస్టర్ నిఘంటు కంపెనీ వెల్లడించింది. ఒక వ్యక్తి ఫొటో, వీడియో, ఆడియోలను మార్చి, ఆ వ్యక్తి చేయని పనిని చేసినట్లుగా, పలకని మాటలను పలికినట్లుగా చూపడమే డీప్ ఫేక్ అని నిఘంటు నిర్మాతలు నిర్వచించారు

★ 2023లో జనం చాలా ఎక్కువగా అన్వేషించిన పదాలు

రిజ్ (రొమాంటిక్ ఆకర్షణ, సమ్మోహనశక్తి),
కబుట్స్ (ఇజ్రాయెలీ సాముదాయిక వ్యవసాయక్షేత్రం, జనావాసం),
ఇంప్లోడ్ (అంతఃస్పోటనం),
కొరొనేషన్(పట్టాభిషేకం).