BIKKI NEWS (FEB. 27) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో భాగంగా ‘మహాలక్ష్మి’ పథకం కింద గృహ అవసరాలకు ఉపయోగించే వంటగ్యాస్ సిలిండర్ ను 500/- రూపాయాలకే అందించే పథకానికి (LPG CYLINDER SUBSIDY SCHEME MAHA LAXMI) సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకానికి అర్హతగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే వర్తింపజేయాలని ఉత్తర్వులలో స్పష్టం చేసింది.
★ నిబంధనలు :
వినియోగదారులు కచ్చితంగా ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ఈ పథకం కొరకు దరఖాస్తు చేసి ఉండాలి.
వినియోగదారులు కచ్చితంగా ఆహార భద్రత కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
వినియోగదారుల పేరు మీద ప్రస్తుతం ఎల్పిజి కనెక్షన్ కలిగి ఉండాలి.
సబ్సిడీ అమౌంట్ ను నెలవారీగా గ్యాస్ కంపెనీలకు చెల్లిస్తారు. సంబంధించిన గ్యాస్ కంపెనీల నుంచి సబ్సిడీ మొత్తం వినియోగదారుల ఖాతాల్లో చేరుతుంది.
గత మూడు సంవత్సరాలలో వినియోగించిన సగటు వినియోగం ఆధారంగా ఎన్ని సిలిండర్ లకు సబ్సిడీ ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించనుంది.