TGPSC – JL స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ వెరిఫికేషన్

BIKKI NEWS (JULY 25) : JUNIOR LECTURER SPORTS QUOTA CERTIFICATE VERIFICATION. ఇంటర్మీడియట్ విద్యాశాఖ పరిధిలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకుని, అర్హత సాధించిన 298 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ను విడుదల చేశారు.

JUNIOR LECTURER SPORTS QUOTA CERTIFICATE VERIFICATION

జులై 26 మరియు జూలై 30, 31వ తేదీలలో స్పోర్ట్స్ కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించనున్నారు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లను చూడవచ్చు. మరియు ఏ రోజు ఎవరికీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉందో కూడా చూడవచ్చు

స్పోర్ట్స్ సర్టిఫికెట్ ఒరిజినల్ తో పాటు రెండు కాపీల జిరాక్స్ లను మరియు స్పోర్ట్స్ కోటాను అందించే జీవో నెంబర్ 74 కాపీని కూడా తీసుకొని నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయానికి తెలుపబడిన తేదీలలో హాజరు కావాల్సి ఉంటుంది.

J.L. SPORTS QUOTA CERTIFICATE VERIFICATION SCHEDULE

జులై 26 మరియు 30, 31వ తేదీలలో హాజరు కాలేకపోయినా అభ్యర్థులకు ఆగస్టు 3 తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రిజర్వుడేగా ప్రకటించారు. అభ్యర్థులు జూలై 3వ తేదీన కూడా హాజరయి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు