Home > JOBS > HIGH COURT – JL పరీక్ష తెలుగులోను నిర్వహించాలి

HIGH COURT – JL పరీక్ష తెలుగులోను నిర్వహించాలి

హైదరాబాద్ (మార్చి – 20) : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ (JL) పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించే రాత పరీక్షల్లో రెండో పేపర్ ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఆంగ్ల భాషల్లో ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)ని ఆదేశిస్తూ సోమవారం హైకోర్టు (HIGH COURT) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

నియామక నిబంధనలు లేకుండా ఇష్టానుసారం పరీక్ష విధానాన్ని మార్చే అధికారం TSPSC కి లేదని హైకోర్టు న్యాయమూర్తి కె. శరత్ విచారణ చేపట్టి మద్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.