BIKKI NEWS (DEC. 21) : JEE ADVANCED 2025 EXAM DATE. దేశంలోని 23 ఐఐటీలలో నాలుగేండ్ల బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది.
JEE ADVANCED 2025 EXAM DATE
ఈ పరీక్షను 2025 మే 18న నిర్వహించనున్నట్టు ఐఐటీ కాన్పూర్ తెలిసింది. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉండగా, వీటిల్లో 17,740 బీటెక్ సీట్లున్నాయి.
అడ్వాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్-2కు పరీక్షను నిర్వహిస్తారు. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరవడం తప్పనిసరి.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పరీక్ష షెడ్యూల్
మే 18 : జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
22 మే : పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు వెబ్‌సైట్లో ఉంచుతారు
26 మే : ప్రాథమిక కీ విడుదల
మే 26-27 వరకు : కీపై అభ్యంతరాల స్వీకరణ
జూన్ 2: ఉదయం 10 గంటలకు తుది కీ, ఫలితాల విడుదల
జూన్ 2, 3: ఏఏటీ రాసేందుకు రిజిస్ట్రేషన్
05 జూన్: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టుపరీక్ష
08 జూన్ : ఫలితాలు
- AFCAT 2025 – ఏఎఫ్ క్యాట్ 2025 నోటిఫికేషన్
- రైల్వే లో టీచింగ్ జాబ్స్ – 1036 ఉద్యోగాలకై నోటిఫికేషన్
- INTER – 26 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 22- 12 – 2024
- AE Certificate Verification : ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్