B.Ed Admissions : గిరిజన బీఈడీ కళాశాలలో అడ్మిషన్లు

భద్రాచలం (ఆగస్టు – 21) : తెలంగాణ రాష్ట్రంలోని ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం భద్రాచలం ఐటిడిఎ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రత్యేక గిరిజన బి.ఇ.డి. కళాశాలలో 2023-2025 విద్యా సంవత్సరమునకు గాను (25వ బ్యాచ్) 2 సం||ల రెగ్యులర్ బి.ఎడ్. కోర్స్ లో మొత్తం -100 సీట్లకు ప్రవేశం నిమిత్తం ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంత గిరిజన పట్టభద్రుల నుండి నేరుగా దరఖాస్తులు కోరబడుచున్నాయి.

ప్రవేశమునకు అర్హతలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అభ్యర్థులు ఏజెన్సీ షెడ్యూల్డ్ ప్రాంతములకు చెందిన గిరిజన పట్టభద్రులై ఉండాలి. డిగ్రీ పాసై కనీసం 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎంపిక విధానం : సంబంధిత డిగ్రీ పరీక్షలో సాధించిన మెరిటిని బట్టి ఎంపిక జరుగుతుంది. ప్రభుత్వ నియమాల ప్రకారం మహిళలకు ప్రత్యేక కేటగిరి వారికి సీట్లు రిజర్వు చేయబడ్డాయి. ప్రభుత్వ ఉత్తర్వులు నెం.14, తేది: 12-04-2021, నెం. 53, తేది: 19-05-2009 ప్రకారం పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

ప్రాస్పెక్టస్ మరియు దరఖాస్తులు ఉచితంగా లభించు ప్రదేశాలు: భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూర్, సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం మరియు కె.ఆర్.పురం ఐ.టి.డి.ఎ కార్యాలయములలోను మరియు ఈ కళాశాలలో ప్రాస్పెక్టన్ మరియు దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చును.

దరఖాస్తు పోస్ట్ ద్వారా పొందగోరు అభ్యర్థులు తమ స్వంత అడ్రన్ గల కవర్ (రూ.10/- స్టాంపుతో) ను ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలం కు పంపి పొందవచ్చును.

దరఖాస్తు మరియు ప్రాస్పెక్టన్ క్షుణ్ణంగా చదివి దరఖాస్తుని సక్రమంగా పూర్తిచేసి సమర్పించవలెను. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరించబడును. దరఖాస్తు నమూనా ప్రకారం పూర్తి చేసి తగు ప్రతులు జతచేసిన దరఖాస్తులు కళాశాలకు చేరవలసిన చివరి తేది: 20-09-2023.

మరిన్ని వివరాలకు: 7893671160, 8919705591