CHANDRAYAAN – 3 : చివరి కక్ష్యలోకి చంద్రయాన్

హైదరాబాద్ (ఆగస్టు – 17) : ISRO – CHANDRAYAAN – 3 మిషన్ లో చివర కక్ష్య తగ్గింపు ప్రక్రియను బుధవారం విజయవంతంగా పూర్తి చేసింది. తాజా తగ్గింపుతో వ్యోమనౌక చంద్రుడి చుట్టూ ఉన్న 153 కి.మీ x 163 కి. మీ. కక్ష్యలోకి ప్రవేశించింది. ఇప్పటివరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయ వంతంగా పూర్తయ్యాయి. Isro chandrayaan 3 module separation today

జాబిల్లిపై పరిశోధనలు కోసం రోదసిలోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి మరింత చేరువైంది. చంద్రయాన్-3 కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని బుధవారం మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది.

◆ నేడు ల్యాండర్ సెపరేషన్

గురువారం వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపడతారు. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ సొంతంగా జాబిల్లిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది.