BIKKI NEWS (OCT. 03) : Israel bans Antonio Guterres to entering into country. ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరస్ పై ఇజ్రాయెల్ తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Israel bans Antonio Guterres to entering into country
ఇరాన్ తమపై చేస్తున్న దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించకపోవడమే ఈ నిషేధం విధించడానికి ప్రధాన కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఇజ్రాయెల్ తమ పొరుగు దేశాలు అయినా ఇరాన్ , లెబనాన్ లతో మరియు హెజుబుల్లా గ్రూప్ తో భీకరమైన యుద్ధంలో మునిగి ఉంది. తాజాగా ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐరాస తమకు మద్దతు తెలపడం లేదు అని భావిస్తున్న ఇజ్రాయెల్ ఐరాస ప్రధాన కార్యదర్శి అయినా అంటోనియో గుటెరస్ ను తమ దేశంలోకి ప్రవేశించడానికి, పర్యటించడాన్ని నిషేధించింది.