Home > INTERNATIONAL > IRAN – ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ మృతి

IRAN – ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ మృతి

BIKKI NEWS (MAY – 20) : ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ (Iran president Ebrahim Raisi died in helicopter crash) హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందారు. హెలికాప్టర్‌ కూలిన ప్రాంతం మొత్తం కాలిపోయింది. అందులో అధ్యక్షుడు రైసీతోపాటు విదేశాంగ మంత్రి అబ్దొల్లాహియాన్‌, అజర్‌ బైజాన్‌ గవర్నర్‌, ఇతర ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్నారు.

అజర్‌బైజాన్‌ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన డ్యామ్‌ ప్రారంభోత్సవానికి వెళ్లిన అధ్యక్షుడు, తిరుగు ప్రయాణంలో తబ్రిజ్‌ నగరానికి వెళ్తుండగా ఆదివారం సాయంత్రం అజర్‌బైజన్‌ సరిహద్దుల్లోని జోల్ఫాలో హెలికాప్టర్ కుప్పకూలింది.