Home > TODAY IN HISTORY > HUMAN RIGHTS DAY – ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

HUMAN RIGHTS DAY – ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం

BIKKI NEWS (DEC – 10) : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం (INTERNATIONAL HUMAN RIGHTS DAY) డిసెంబరు 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్య సమితి విశ్వమానవ హక్కుల ప్రకటన చేసింది. అందువల్ల డిసెంబరు 10వ తేదీని అంతర్జాతీయ మానవహక్కుల దినంగా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటారు.

76th HUMAN RIGHTS DAY 2024

10 డిసెంబర్ 2024, ప్రపంచంలోని అత్యంత సంచలనాత్మక ప్రపంచ ప్రతిజ్ఞలలో ఒకటి: మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన  (UDHR) యొక్క 76వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. జాతి, రంగు, మతం, లింగం, భాష, రాజకీయ లేదా ఇతర అభిప్రాయాలతో సంబంధం లేకుండా, జాతీయ లేదా సామాజిక మూలం, ఆస్తి, పుట్టుక లేదా ఇతర హోదాలతో సంబంధం లేకుండా – ఈ మైలురాయి పత్రం మానవుడిగా ప్రతి ఒక్కరూ పొందవలసిన అమూల్యమైన హక్కులను పొందుపరిచింది.

HUMAN RIGHTS DAY 2024 THEME

The theme for Human Rights Day 2024 is “Our rights our future right now” (మన హక్కులు మన భవిష్యత్ ఇప్పటికిప్పుడే)

మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పాటు చేయబడ్డాయి.

ఐదేళ్ళకోసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కులకు సంబంధించిన వారికి ఇచ్చే పురస్కారం, అలాగే అత్యున్నత నోబెల్‌ బహుమతి అందుకున్న వారిని ఈరోజున సత్కరిస్తారు.

క్రీ.శ. 1215 లో ఇంగ్లండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన ‘మాగ్నా కార్టా’ మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుండే భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు రూపొందాయి. 1993లో రూపొందిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1994, జనవరి 8నుండి అమలులోకి వచ్చింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు