Home > EDUCATION > INTERMEDIATE > INTER EXAMS – తొలి రోజు ఇద్దరు డిబార్

INTER EXAMS – తొలి రోజు ఇద్దరు డిబార్

BIKKI NEWS (MAR. 05) : INTER EXAMS FIRST DAY 2 STUDENTS DEBAR.. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తొలి రోజు ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజెస్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం రెండు డిబార్ కేసులు మాత్రమే తొలి రోజు నమోదు అయ్యాయి.

INTER EXAMS FIRST DAY 2 STUDENTS DEBAR

సీసీ కెమెరాలు పర్యవేక్షణ, ఇంటర్ బోర్డ్ అప్రమత్తత, అధికారుల నిరంతరం పర్యవేక్షణలో చాలా ప్రశాంతంగా తొలి రోజు పరీక్షలు ముగిశాయి.

తొలి రోజు పరీక్షకు 5,14,184 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 4,96,899 మంది హజరయ్యారు. 17,010 మంది గైర్హాజరయ్యారు. 2 డిబార్ అయ్యారు. వీరిద్దరూ హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలకు చెందిన విద్యార్థులు.

బోర్డు నుంచి పరీశీలకులు సిద్దిపేట, మహబూబ్ నగర్, పెద్దపల్లి, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో పర్యటించి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు రిపోర్ట్ చేసినట్లు బోర్డు ప్రకటించింది.

FOLLOW US

@INSTAGRAM

@YOUTUBE

@TELEGRAM

@WHATSAPP

తాజా వార్తలు