Home > 6 GUARANTEE SCHEMES > INDIRAMMA COMMITTEES – త్వరలో ఇందిరమ్మ కమిటీలు

INDIRAMMA COMMITTEES – త్వరలో ఇందిరమ్మ కమిటీలు

హైదరాబాద్ (జనవరి – 10) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందజేయడానికి గ్రామ, వార్డలలో ఇందిరమ్మ కమిటీలు (indiramma committees in telangana) ఏర్పాటు చేయనున్నట్లు జిల్లాల సమీక్ష సమావేశంలో వెల్లడించారు.

తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు, సక్రమంగా ప్రజలకు చేరేలా చూడాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దని నేతలకు సూచించారు. నిజాయితీ, నిబద్ధత ఉన్న అధికారులను నియోజకవర్గాల్లో నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్స హించేది లేదని ఆయన స్పష్టంచేశారు. అధికారులు, పోలీసులు బదిలీల్లో పైరవీలకు తావు లేదన్నారు.

ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి రూ.10 కోట్లను కేటాయిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు ఈ నిధుల కేటాయింపు, పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తున్నామన్నారు. ఇన్ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.