Home > SPORTS > INDvsPAK – నేడే భారత్ పాక్ మ్యాచ్ – గణంకాలు ఏమి చెబుతున్నాయి.?

INDvsPAK – నేడే భారత్ పాక్ మ్యాచ్ – గణంకాలు ఏమి చెబుతున్నాయి.?

BIKKI NEWS (FEB. 23) : INDIA vs PAKISTAN MATCH IN CHAMPIONS TROPHY. ఛాంపియన్స్ ట్రోపీలు భాగంగా నేడు భారత్ పాకిస్తాన్ ల మధ్య మ్యాచ్ జరగనుంది.

INDIA vs PAKISTAN MATCH IN CHAMPIONS TROPHY

రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా, రిజ్వాన్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 2.30 గంటల నుండి తలపడనున్నాయి.

ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ఓటమిపాలై ఉంది.

INDIA PAKISTAN MATCHES RECORDS

వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ లలో పాక్ పై భారత్ ఆధిపత్యం స్పష్టంగా ఉన్నప్పటికీ… చాంపియన్స్ ట్రోఫీ లో మాత్రం పాకిస్తాన్ ఆదిపత్యంలో ఉండడం విశేషం.

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు భారత్ పాకిస్తాన్ లు 5 సార్లు తడపడగా… పాకిస్తాన్ 3 సార్లు విజయం సాధించగా, భారత్ 2 సార్లు మాత్రమే విజయం సాధించింది.

ఓవరాల్ గా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య 135 వన్డేలు జరగగా… భారత్ 57 మ్యాచులలో గెలిస్తే 73 మ్యాచ్ లలో ఓడిపోయింది. మరో ఐదు మ్యాచ్ లలో ఫలితం తేలలేదు.

గత 14 ఏళ్ల కాలంలో వన్డేలు, టీ20 లు కలిపి భారత్ పాకిస్తాన్ మధ్య 13 మ్యాచులు జరిగితే భారత్ 11 గెలిచి, 2 మ్యాచ్ లలో మాత్రమే ఓటమి పాలైంది.

పాకిస్తాన్ తో జరిగిన గత 11 వన్డేలలో భారత్ 9 గెలిచి, 2 మాత్రమే ఓటమి పాలవడం విశేషం.

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు