BIKKI NEWS : ఇండియా పేరును భారత్ (INDIA to BHARAT) మార్చాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు ఊహాగానాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ లో జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఇండియా పేరును భారత్ గా (INDIA to BHARAT and Name changed Countries list and causes) మారుస్తూ చట్టం తేనున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో పేర్లు మార్చుకొన్న దేశాలు.. కారణాలను పరిశీలిద్దాం.
★ టర్కీ-తుర్కియే
టర్కీ తమ దేశం పేరును తుర్కియేగా మార్చుకొంటున్నట్టు
2022 జూన్ ఐక్యరాజ్య సమితి కి తెలిపింది. తుర్కియే అనే పేరు తమ సంస్కృతి, నాగరికత, విలువలకు అద్దం పడుతుందని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ చెప్పారు. తమ సాంస్కృతిక మూలాలకు మరింత చేరువయ్యేందుకు పేరు మార్చుకొన్నట్టు వెల్లడించారు.
★ హాలండ్-నెదర్లాండ్స్
హాలండ్ తన పేరును నెదర్లాండ్స్ గా మార్చుకొన్నది. తన గ్లోబల్ ఇమేజ్ ను పెంచుకొనేందుకు పేరు మార్చుకొన్నట్టు ప్రకటించింది.
★ చెక్ రిపబ్లిక్- చెకియా
సెంట్రల్ యురోపియన్ దేశం చెక్ రిపబ్లిక్.. ఈ సంవత్సరం తన పేరును చెకియాగా మార్చు కొన్నది. స్పోర్ట్స్ కంపెనీలు క్రీడా జట్ల ఉత్పత్తులు, దుస్తులపై పేరును సులుభంగా రాసుకొనే వీలు కల్పించేందుకు పేరును మార్చుకొన్నట్టు వెల్లడించింది.
★ బర్మా – మయన్మార్
తరతరాలుగా©బర్మన్ జాతి ఆధిపత్య సమూహం తర్వాత ఆ దేశాన్ని సంప్రదాయకంగా బర్మా అని పిలుస్తున్నారు. కానీ,
1989లో పాలక జుంటా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటును అణచివేసిన ఏడాది తర్వాత ఆ దేశం పేరును సైనిక నాయకులు హఠాత్తుగా మయన్మార్ అని మార్చేశారు.
★ సిలోన్- శ్రీలంక
1972లో సిలోన్ తన పేరును శ్రీలంకగా మార్చుకొన్నది. వలస, బ్రిటిష్ సంస్కృతి నుంచి సంబంధాలు తెంచుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నది. 2011లో ప్రభుత్వ వినియోగం నుంచి అధికారికంగా వలస రాజ్యాలకు ప్రతీకగా ఉన్న సిలోన్ పేరును పూర్తిగా తొలగించింది.
★ స్వాజిలాండ్- ఈశ్వతిని
కింగ్ డమ్© ఆఫ్ స్వాజిలాండ్ పేరును కింగ్డమ్ ఆఫ్ ఈశ్వతినిగా మారుస్తున్నట్టు 2018 ఏప్రిల్ లో ఆ దేశ రాజు ఎంస్వాతి – 3 ప్రకటించారు. స్వాజిలాండ్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు.
★ రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా -రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మాసిడోనియా
2019లో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పేరును రిపబ్లిక్
ఆఫ్ నార్త్ మాసిడోనియాగా మార్చేశారు. అయితే, తమ పౌరులను నార్త్ మాసిడోనియన్లు అని కాకుండా మాసిడోనియన్లు అని పిలువాలని ఆ దేశం పేర్కొన్నది.
★ పర్షియా – ఇరాన్
ప్రస్తుత ఇరాన్ ను పూర్వం సాంప్రదాయకంగా పర్షియా అని పిలుస్తున్నారు. రెజా షా రాజుగా బాధ్యతలు స్వీకరించాక నూతనత్వం కోసం 1935లో పర్షియా పేరును ఇరాన్ గా మార్చారు. రాజ్యంపరంగా ఇరాన్ అనిళపిలుస్తున్నా.. ఆహారం, కళలు, సాహిత్యం లాంటి దీర్ఘకాలిక సాంస్కృతిక ఎగుమతులను పర్షియన్ గానే వ్యవహరిస్తున్నారు.