BIKKI NEWS (MARCH 09) : ICC CHAMPIONS TROPHY 2025 WON BY INDIA. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా భారత్ నిలిచింది.
ICC CHAMPIONS TROPHY 2025 WON BY INDIA
ఫైనల్ లో టీమిండియా న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్ గా నిలిచింది.
ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ ఫైనల్ లో భారత్ జట్టు సభ్యులు సమిష్టిగా రాణించి… ఒత్తిడిని చిత్తు చేస్తూ…. తమ పని తాము చేసుకుంటూ పోయి నిజమైన ఛాంపియన్స్ గా నిలిచారు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ ను భారత స్పిన్నర్ లు కట్టడి చేయడంతో 251/7 పరుగులు చేశారు. కివీస్ బ్యాటృమన్ లలో డారిల్ మిచెల్ 63, బ్రాస్‌వెల్ 53 *, రచిన్ రవీంద్ర – 37 పరుగులతో రాణించారు.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కలదీప్ యాదవ్ తలో రెండు వికెట్లు, షమీ, జడేజా తలో వికెట్ తీశారు.
అనంతరం 252 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా కు ఓపెనర్స్ రోహిత్ శర్మ – 76, గిల్ – 31… సెంచరీ భాగస్వామ్యం తో సుభారంభం అందించారు.
తర్వాత వెంటవెంటనే వికెట్లు పడడంతో కొంత ఒత్తిడి కి లోనైనా శ్రేయస్ అయ్యర్ – 48, అక్షర్ పటేల్ – 29, కేఎల్ రాహుల్ – 34, పాండ్యా – 18 పరుగులతో తమ పాత్రలు చక్కగా పోషించడంతో టీమిండియా ఘనవిజయం సాధించింది.
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th