BIKKI NEWS: భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జూన్ 21న నిర్వహించిన టైర్ -2 (మెయిన్) పరీక్షలో అర్హత సాధించి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ కు షార్టిస్ట్ అయినవారి జాబితాను గురువారం ప్రకటించారు. అభ్యర్థులు తమ ఫలితాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
వ్యవసాయ పరిశోధనా సంస్థలో మొత్తం 806 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి గతేడాది మే 7 నుంచి జూన్ 25వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ తర్వాత జులై 29న టైర్ 1 పరీక్ష నిర్వహించగా.. 2023 జూన్ 21న టైర్-2 పరీక్ష నిర్వహించి తాజాగా ఫలితాలు ప్రకటించారు.
కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT)కి షార్ట్ లిస్ట్ అయినవారి స్టేటస్ ను డిసెంబర్ 1 రాత్రి 11.55 గంటల వరకు చెక్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) టెస్ట్ కు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.