హైదరాబాద్ (డిసెంబర్ – 01) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 9,168 పోస్టులతో గ్రూప్ – 4 నోటిఫికేషన్ (tspsc group-4-notification) ను ఈరోజు విడుదల చేసింది.
జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎకౌంటెంట్, జూనియర్ అడిటర్, వార్డ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 23 – 2022 నుంచి ప్రారంభం కానుంది. జనవరి 12 – 2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ గా నిర్ణయించారు.
గ్రూప్ 4 పరీక్షలు ఏప్రిల్/మే 2023వ సంవత్సరంలో ఉండనున్నాయి. పూర్తి నోటిఫికేషన్ డిసెంబర్ 23న అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచనున్నారు.