INTERMEDIATE – గ్రేడింగ్ పద్దతిలో మార్కులు.!

హైదరాబాద్ (మే – 11) : తెలంగాణలో పదవ తరగతి తరహాలోనే ఇంటర్ లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇవ్వాలని (intermediate education grading instead of marks) సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్కుల వలన విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది.

కొన్నేళ్ల నుంచి జేఈఈ మెయిన్, నీట్ ర్యాంకుల్లో ఇంటర్
మార్కులకు వెయిటేజీ లేదు. ఈసారి నుంచి ఎంసెట్ కు
శాశ్వతంగా వెయిటేజీ తొలగించారు. ఈ క్రమంలో ఇంటర్ లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? తదితర పలు అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీని నియమించాలని భావిస్తోంది.