CPS SCHEME – రద్దు చేసిన రాజస్థాన్ ప్రభుత్వం

BIKKI NEWS : కాంట్రిబ్యూటరీ పింఛన్ స్కీం (CPS)ను రాజస్థాన్ ప్రభుత్వం రద్దు (cps scheme) చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గెహ్లట్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించాడు.

దేశవ్యాప్తంగా ఉన్న 84 లక్షల రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 నుంచి సీపీఎస్ విధానాన్ని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో కూడా సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.