GLOBAL COMPITITIVENESS INDEX 2023 REPORT : ప్రపంచ పోటీతత్వ సూచీ

BIKKI NEWS : ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (IMD) విడుదల చేసిన ప్రపంచ పోటీతత్వ సూచీ (GLOBAL COMPITITIVENESS INDEX 2023 REPORT) నివేదికలో భారత్ గతేడాదితో పోలిస్తే 3 స్థానాలను కోల్పోయి 40వ స్థానంలో నిలిచింది.

2022లో 37వ స్థానంలో ఉండేది. 2019-21 మధ్య మూడేళ్లు భారత్ వరుసగా 43వ ర్యాంకులో ఉంది.

మొత్తం 64 దేశాలతో ఔ జాబితాను IMD రూపొందించింది.

◆ మొదటి 10 దేశాలు :

డెన్మార్క్
ఐర్లాండ్
స్విట్జర్లాండ్
సింగపూర్
నెదర్లాండ్స్
తైవాన్
హాంకాంగ్
స్వీడన్
అమెరికా
యూఏఈ.

తాజా నివేదిక ప్రకారం.. : భారత్ తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నా ఇతర దేశాలతో పోలిస్తే వ్యాపార సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, ఆర్థిక ప్రదర్శన వంటి వాటిలో కొంత వెనుకబడి ఉంది. మారకం రేటు స్థిరత్వం, పరిహారం స్థాయిలు, కాలుష్య నియంత్రణలో మెరుగదల వంటివి భారత స్కోరులో సాయపడ్డాయి. అధిక జీడీపీ వృద్ధిని కొనసాగించడం, ఆర్థిక మార్కెట్ అస్థిరతను ఎదుర్కోవడం, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు నియంత్రణ, డిజిటల్ట్ ట్రాన్స్ఫార్మేషన్ ను వేగవంతం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి వనరుల సమీకరణ వంటి సవాళ్లను భారత్ ఈ ఏడాది ఎదుర్కొంటున్నదని ఐఎండీ తన నివేదికలో వివరించింది.