జీజేసీ గర్ల్స్ సిద్దిపేట విద్యార్థినికి స్టేట్ 7వ ర్యాంక్

BIKKI NEWS (APRIL 27) : 2023- 24 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినిలు ప్రైవేటు మరియు కార్పొరేట్ కళాశాలకు దీటుగా, రాష్ట్రస్థాయిలో మార్కులు సాధించి చరిత్ర సృష్టించారని ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో (GJC SIDDIPET GIRLS COLLEGE INTERS RESULTS) తెలిపారు.

అతి సాధారణ విద్యార్థులతో ఈ అద్భుతమైన ఫలితాలను సాధించడం చాలా సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేయడం జరిగింది.

ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం విభాగంలో రక్ష 462/470 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 7వ ర్యాంకును, ఇంటర్ మొదటి సంవత్సరం బైపిసి విభాగంలో ఇమ్రా సదాఫ్ 424 మార్కులు, సెకండ్ ఇయర్ బైపీసీ ఇంగ్లీష్ మీడియం విభాగంలో జువేరియా 979 మార్కులు, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం విభాగంలో సిహెచ్ అనూష 954 మార్కులు, సీఈసీ ఇంగ్లీష్ మీడియం విభాగంలో హుదా ఫాతిమా 949 మార్కులు మరియు ఉర్దూ మీడియం బైపీసీ విభాగంలో తహేరా ఫాతిమా 924 మార్కులు, సిఫా అమీనా 913 మార్కులు, ఒకేషనల్ విభాగంలో A&T గ్రూప్ యందు జే.రేఖా 929 మార్కులు సాధించడం గర్వకారణం అని తెలిపారు.

అదేవిధంగా మిగతా విద్యార్థినిలు అందరు కూడా రాష్ట్రస్థాయి మార్కులు సాధించడం చాలా అభినందనీయమని అన్నారు. ప్రతిరోజు చాలా చక్కగా క్లాసులు చెప్పడంతో పాటుగా, ప్రతి విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతోపాటు, సాయంత్రం ప్రతిరోజు స్టడీ అవర్స్ ను నిర్వహించడం వల్ల, అదే విధంగా చదువులో వెనుకబడ్డ విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి, వారికి ప్రత్యేకమైన క్లాసులు చెప్పించడం వల్ల, ఉత్తీర్ణత శాతం కూడా గణనీయంగా పెరిగిందని అన్నారు. మంచి విద్యతోపాటుగా క్రమశిక్షణను కూడా విద్యార్థినులకు పెంపొందించడం జరుగుతుందన్నారు. కావున పదవ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థినిలు అందరు కూడా మా ప్రభుత్వ కళాశాలలో చేరాలని, మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపాల్ కోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు లెక్చరర్స్ బృందం మరియు విద్యార్థినిలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కుల సాధించిన విద్యార్థినులందరికీ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటుగా లెక్చరర్స్ బృందం, శాలువలతో సన్మానించడం జరిగింది.