జీజేసీ కోరుట్ల (B) అధ్యాపకుల అడ్మిషన్ డ్రైవ్

కోరుట్ల (MAY 19) : రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ పొందడానికి కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర ఉపన్యాసకులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివితే వచ్చే లాభాల గురించి చెప్పి ప్రభుత్వ కళాశాలలో బలోపేతానికి కృషి చేయడం(gjc korutla boys lecturers admission drive) జరుగుతుంది.

మండలం లోని గ్రామాలు ఏకీన్పూర్, నాగులపేట్, దమ్మన్నపేట్, మమన్నెగూడెం, కలవకోట, సంగెం,
మోహనరావు పేట్, వళ్లంపెల్లి అన్ని తిరుగుతూ ప్రభుత్వ కళాశాలలో విద్యను అభ్యసిస్తే రెండు సంవత్సరాల ఉచిత విద్యతో పాటు రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ మరియు ఇతర టెక్నికల్ కోర్సులలో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ వారికి ఆ కోర్స్ పూర్తిగా ఉచితంగా పూర్తి చేయబడుతుందని, ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మాత్రమే అవకాశం కావున దీనిని సద్వినియోగం చేసుకొవాలని సూచించారు.

కార్పొరేట్ కళాశాలలో మోజులో పడకుండా ఉచిత విద్యను అందించే కళాశాలలో చేరి కళాశాల అభ్యున్నతికి పాటుపడాలని కళాశాల ప్రిన్సిపల్ జిందం రాజేష్ మరియు వారితో పాటు ఉపన్యాస కులు శ్రీనివాస్, వంశీకృష్ణ, శిరీస్, సాయి కృష్ణ, యమ్. రాజు లు పాల్గొన్నారు.