విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందజేత

హయత్ నగర్ (ఫిబ్రవరి – 08) : ప్రభుత్వ జూనియర్ కళాశాల, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా నందు ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ విద్యార్థులందరికీ పొలిటికల్ సైన్స్ స్టడీ మెటీరియల్ ని స్వయంగా రూపొందించి విద్యార్థులకు ఈరోజు ఉచితంగా (free study material supplied at gjc hayath nagar) కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఏ. వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగిందని రాజనీతి శాస్త్రం అధ్యాపకులు మారం హేమచందర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఈజీ లెర్నింగ్ మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు ఉచితంగా అందజేసినటువంటి రాజనీతి శాస్త్రం అధ్యాపకులు మారం హేమచందర్ మాట్లాడుతూ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీదేవి గారు ఉత్తీర్ణత శాతం పెంచడానికి అధ్యాపకులందరూ విశేష కృషి చేయాలని వారు ఇచ్చినటువంటి విలువైనటువంటి సూచనలు అనుసరించి ఈ మెటీరియల్ రూపొందించానని, అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరూ కూడా అత్యంత పేద కుటుంబాలకు చెందిన వారు కావడం మూలంగా వారి యొక్క ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచాలని ఉద్దేశంతో ఈ స్టడీ మెటీరియల్ రూపొందించి వారికి ఉచితంగా అందజేశానని తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మరియు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీమతి శ్రీదేవి గారు, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం వారిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పి. లక్ష్మయ్య, శ్రీమతి ఎం.శశి మరియు స్టాఫ్ మెంబర్స్ పాల్గొన్నారు.