BIKKI NEWS (APRIL 23) : భారత్ కు చెందిన ఎవరెస్ట్ మరియు ఎండిహెచ్ మసాలా కంపెనీ ఉత్పత్తులపై తాజాగా హాంకాంగ్ దేశం నిషేధం (Everest and MDH masalas banned in Singapore and Hongkong) విధించింది. ఇటీవల సింగపూర్ కూడా ఎవరెస్ట్ మసాలా ఉత్పత్తులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఇథిలిన్ ఆక్సైడ్ కారణం
ఎవరెస్ట్ మరియు ఎండి హెచ్ మసాలా ఉత్పత్తులలో ఇతిలిన్ ఆక్సైడ్ అనే రసాయన మోతాదుకు మించి ఉంది అని ఆదేశ ఆహార భద్రత విభాగం పేర్కొనడంతో ఆ దేశాలు ఈ మసాలాలపై నిషేధం విధించాయి.
దుష్ప్రభావం ఏమిటి
ఇథిలిన్ ఆక్సైడ్ కు మండే స్వభావం ఉంటుంది. ఈ రసయానాన్ని హెల్త్ కేర్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ఆహార ఉత్పత్తులు నిల్వ ఉంచడానికి వాడుతారు.
ఇది మోతాదుకు మించి శరీరంలో చేరితే నాడీ మండల వ్యవస్థ,. మెదడు, డీఎన్ఏ పై ప్రభావంతో పాటుగా, రొమ్ము క్యాన్సర్ కు కారణం కాగలదు.
విదేశాల్లో నిషేధానికి గురైన ఈ రెండు మసాలా బ్రాండ్ల పై భారత్ లోని వివిధ ప్రాంతాల నుండి సేకరించి ఫుడ్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ల్యాబ్ లో పరిశోధన చేయిస్తుంది .