నామాల రామకృష్ణకు డాక్టరేట్

BIKKI NEWS (APRIL 26) : తెలుగు పరిశోధక విద్యార్థి నామాల రామకృష్ణకు తెలుగు విభాగంలో ‘వరంగల్ జిల్లా పద్మకవుల్లో అల్లూరి రాజేశ్వరకవి జీవితం, సాహిత్యం-ప్రత్యేకఅధ్యయనం’ అనే పరిశోధనకు డాక్టరేట్ ను కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి ప్రకటించారు. ప్రొఫెసర్ కొంక యాదగిరి పర్యవేక్షణలో పరిశోధన చేసి సిద్దాంత గ్రంథాన్ని సమర్పించినందుకు గాను కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ను (doctorate for Namala Ramakrishna) ప్రకటించింది.

హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికలపేట గ్రామానికి చెందిన రామకృష్ణ ఉద్యోగ రీత్యా రామగుండం జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడి గా పని చేస్తున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ ను కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగ అధ్యాపకులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించారు.