Home > SCIENCE AND TECHNOLOGY > మానవులలో వివిధ రకాల దృష్టి లోపాలు : కటకాలు

మానవులలో వివిధ రకాల దృష్టి లోపాలు : కటకాలు

BIKKI NEWS : మానవులలో వివిధ రకాల దృష్టి లోపాలు (different-types-of-visual-impairments-in-humans) కనిపిస్తాయి… కొన్ని కంటి లోపలి భాగలలో లోపం వలన ఏర్పడితాయి, వీటిని కటకాలను ఉపయోగించి సరి చేరవచ్చు. కొన్ని జన్యుపరంగా సంక్రమిస్తాయి. వీటికి చికిత్స లేదు.

(1) హ్రస్వదృష్టి (myopia) :- దగ్గరగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలిగి దూరంగా ఉన్న వస్తువును చూడలేని దృష్టి లోపం.

తగిన నాభ్యాంతరం గల పుటాకార కటకమును (వికేంద్రీకరణ) ఉపయోగించి నివారించవచ్చును.

(2) దూరదృష్టి (Hypermetropia) :-

కంటి నుండి దూరంగా ఉన్న వస్తువును మాత్రమే చూడగలిగి దగ్గరగా ఉన్న వస్తువును చూడలేని దృష్టి లోపం.

తగిన నాభ్యాంతరం గల కుంభాకార కటకంను (కేంద్రీకరణ కటక) ఉపయోగించి నివారించవచ్చును.

(3) ఛత్వారము (PRESBYOPIA) :-
వయస్సు పెరుగుచున్న కొలది కొంతమంది వ్యక్తుల యందు తన నేత్రానుగుణ్యతను కోల్పోవడం వలన దగ్గర దూరంగా ఉన్న వస్తువును చూచుట వీలు కాదు. కాబట్టి ఇటువంటి దృష్టిలోపమును చత్వారం అని అంటారు.

ఈ లోపమును సవరించుట కొరకు ద్వినాభికటకము (bifocal lense) ఉపయోగించాలి.

(4) అసమదృష్టి (ASTIGMATISM) :-

కంటియందు గల కార్నియా (Cornea) అను భాగం దెబ్బతినడం వలన ఈ దృష్టిలోపం ఏర్పడుతుంది. ఈ లోపం కలిగిన వ్యక్తులు ఏ వస్తువును పరిశీలించినను అది నిలువు గీతలుగా లేదా అడ్డుగీతలుగా కనిపిస్తుంది.

ఈ దృష్టి లోపమును నివారించుట కొరకు స్థూపాకార కటకమును ఉపయోగించాలి.

(5) రేచీకటి (NIGHT BLINDNESS) :-

పగలు సమయంలో సూర్యకిరణముల సమక్షం యందు దృష్టి జ్ఞానమును కలిగి ఉండి, రాత్రి సమయంలో చూడలేని ఈ దృష్టిలోపమును విటమిన్-ఎ తో సవరించవచ్చును. కాబట్టి విటమిన్-ఎ ఎక్కువగా కలిగిని ఆహారం తీసుకోవాలి.

(6) వర్ణాంధత్వము (COULOUR BLINDNESS) :-

కంటి యందు గల Cones లలో ఉన్న లోపం వలన వర్ణాంధత్వము అను దృష్టిలోపం ఏర్పడి అన్ని రంగులను గుర్తించుట వీలుకాదు.

ఈ లోపం తల్లిదండ్రుల జన్యువుల ద్వారా సంతానానికి ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ లోపంను సవరించుటకు ఎటువంటి చికిత్సా విధానము లేదు.