BIKKI NEWS (AUG. 09) : Deputy CM. Bhatti Says Will develop GJC WYRA. ఖమ్మం జిల్లా వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధికి సహకరిస్తానని.. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు & ఆర్థిక, విద్యుత్ శాఖ మాత్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు.
ఈరోజు వైరాలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేయటానికి విచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులును కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి యల్. నవీన్ జ్యోతి గారు కలిసి కళాశాలకు కావలసిన అదనపు తరగతి గదుల నిర్మాణానికి కావలసిన నిధులు మంజూరు చేయమని వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.
ప్రిన్సిపాల్ గారు మరియు అధ్యాపకుల అభ్యర్థన మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా శిథిలావస్థలో ఉన్న పురాతన బిల్డింగును పరిశీలించారు. విద్యార్థులకు తరగతి గదుల లేని విషయాన్ని ప్రిన్సిపాల్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ ఉప మంత్రివర్యులు జూనియర్ కళాశాల ప్రాంగణమును పరిశీలించి అదనపు తరగతి గదులు అవసరం పరిశీలించి అదనపు తరగతి గదుల నిర్మాణానికి కావలసిన బడ్జెట్ ఎస్టిమేట్స్ ను తయారు చేయవలసిందిగా జిల్లా ఇంటర్ విద్యశాఖ అధికారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రామదాసు నాయక్ గారు, వైరా మున్సిపల్ చైర్మన్ శ్రీ సూతకని జైపాల్ గారు, జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రవిబాబు గారు, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి యల్. నవీన్ జ్యోతి గారు మరియు అధ్యాపకులు & సిబ్బంది పాల్గొన్నారు.