Home > CURRENT AFFAIRS > STATISTICAL DATA > DEFENSE FORCES OPERATIONS : రక్షణదళ ఆపరేషన్స్

DEFENSE FORCES OPERATIONS : రక్షణదళ ఆపరేషన్స్

BIKKI NEWS : భారత ప్రభుత్వ రక్షణ దళాలు వివిధ సందర్భాలలో చేపట్టిన ముఖ్యమైన ఆపరేషన్స్ (DEFENSE FORCES OPERATIONS list in telugu)పోటీ పరీక్షల నేపథ్యంలో చూద్దాం…

స్వాతంత్ర్యానంతరం భారత రక్షణ దళాలు స్వదేశంలో మరియు విదేశీ యుద్ధ సమయాలలో చేపట్టిన ఆపరేషన్స్ కింద ఇవ్వబడ్డాయి…

DEFENSE FORCES OPERATIONS

1) OPERATION POLO – 1948 :- హైదరాబాద్ నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసిన సైనిక

2) OPERATION VIJAY – 1961 :- గోవా, డామన్ డయ్యూ ప్రాంతాలను పోర్చుగీస్ నుండి భారతదేశంలోకి విలీనం చేయడానికి చేపట్టిన సైనిక చర్య..

3) OPERATION MEGHNA HELI BRIDGE – 1971 : – పాకిస్తాన్ నుండి తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) విముక్తం చేయడానికి మేజ్ఞ నదిని దాటడానికి అత్యంత వేగంగా బ్రిడ్జి నిర్మాణం కోసం చేసిన ఆపరేషన్.

4) OPERATION BLUE STAR – 1984 :- అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దాగి ఉన్న మిలిటెంట్లను ఏరివేయడానికి చేపట్టిన సైనిక చర్య.

5) OPERATION MEGHDOOT – 1984 :- ప్రపంచంలో అతి ఎత్తైన యుద్ధ క్షేత్రంగా పేరుగాంచిన సియాచిన్ భారత్ తన హస్తగతం చేసుకున్న ఆపరేషన్.

6) OPERATION PAWAN – 1987 :- శ్రీలంక – ఎల్టిటిఈ మధ్య అంతర్యుద్ధం కారణంగా ఎల్టిటిఈ వశమైన జాఫ్నా, పెనిన్సులా ప్రాంతాలను తిరిగి శ్రీలంకకు అప్పజెప్పడానికి భారత సైన్య (ఇండియన్ పీస్ స్లీపింగ్ ఫోర్స్) దళాలు చేపట్టిన సైనిక చర్య.

7) OPERATION TRISHUL – 1988 :- శ్రీలంక ఈశాన్య ప్రాంతం నుండి ఎల్టిటిఈ గ్రూపులను ఏరివేయడమే లక్ష్యం గా ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ చేపట్టిన సైనిక చర్య.

8) OPERATION CHECKMATE – 1988 :- శ్రీలంక ఈశాన్య ప్రాంతం నుండి ఎల్టిటిఈ గ్రూపులను ఏరివేసి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిర్వహణ కోసం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ చేపట్టిన సైనిక చర్య.

9) OPERATION CACTUS -1988 :- మాల్దీవుల ప్రజా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కూప్ గ్రూప్ చర్యలను ఆరికట్టడానికి భారత సైనిక దళాలు చేపట్టిన చర్య.

10) OPERATION VIJAY – 1999 :- జమ్మూకాశ్మీర్ లోని కార్గిల్ ప్రాంతంలో సరిహద్దుల వెంబడి చొరబడిన టెర్రరిస్టులు మరియు పాకిస్తాన్ సైనికులను ఏరివేయడానికి భారత రక్షణ దళాలు చేపట్టిన సైనిక చర్య

11) OPERATION SAFED SAGAR – 1999 :- కార్గిల్ యుద్ధంలో పాల్గొంటున్న సైనిక దళాలకు సహాయం అందించడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్

12) OPERATION BLACK TORNADO – 2008 :- ముంబైలోని తాజ్ మహల్ హోటల్ ఇతర ప్రాంతాలలో టెర్రరిస్టులను అంతమొందించడానికి చేపట్టిన ఆపరేషన్

13) OPERATION SURYA HOPE – 2013 :- ఉత్తరాఖండ్ లో సంభవించిన వరదల నుండి పౌరులను కాపాడడానికి చేపట్టిన చర్య

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు