BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 27th JULY
DAILY GK BITS IN TELUGU 27th JULY
1) పేదరిక విష వలయం గురించి వివరించినది ఎవరు.?
జ : రాగ్నార్ నర్క్స్
2) అంతర్జాతీయ పేదరిక రేఖ ఎన్ని డాలర్ల వద్ద కలదు.?
జ : 1.90 డాలర్లు
3) దండేకర్ – రద్ ల పేదరిక సూచీలో ప్రామాణికంగా ఏమి తీసుకున్నారు.?
జ : కనీస వినియోగ కేలరీలు
4) దేశ భౌగోళిక ప్రాంతంలో ఎంత శాతం ఏదో ఒక విపత్తుకు గురవుతుంది.?
జ : 85%
5) భారతదేశ భూభాగంలో ఎంత శాతం ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తుంటాయి.?
జ : 58%
6) భారతదేశ భూభాగంలో ఎంత శాతం ప్రాంతంలో తుపాను లు సంభవిస్తుంటాయి.?
జ : 8%
7) భారతదేశ భూభాగంలో ఎంత శాతం ప్రాంతంలో వరదలు సంభవిస్తుంటాయి.?
జ : 15%
8) బుందేల్ ఖండ్ ప్రాంతం ఎక్కడ కలదు?
జ : యమునా నదికి దక్షిణ భాగం – దక్కన్ పీఠభూమి కి ఉత్తర భాగం
9) ఇండియా లీగ్ అనే సంస్థను ఎప్పుడు స్థాపించారు.?
జ : 1875
10) థర్మాస్ ప్లాస్క్ ను తయారు చేసింది ఎవరు.?
జ : జేమ్స్ దేవర్
11) శూన్యంలో ఉష్ణం ప్రసరించడాన్ని ఏమని పిలుస్తారు.?
జ : ఉష్ణ వికిరణం
12) ఏ రకమైన లోపం ఉన్న వ్యక్తులు ఒకేసారి అడ్డుగీతలను, నిలువుగీతలను చూడలేరు.?
జ :అసమదృష్ఠి
13) నీటిలో ఏటవాలుగా మునిగిన కర్ర వంగినట్లు కనపడే కాంతి ధర్మం ఏమిటి.?
జ : కాంతి వక్రీభవనం
14) సివి రామన్ కు ఏ పరిశోధనకు గాను నోబెల్ బహుమతి లభించింది.?
జ : కాంతి పరిక్షేపణం
15) జన్యు సంబంధమైన లోపం కారణంగా ఏర్పడే కంటి వ్యాధి ఏమిటి.?
జ : వర్ణాంధత్వము
16) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన పలు ప్రాజెక్టుల కోసం చేయించిన సర్వే పేరు ఏమిటి.?
జ : LIDAR సర్వే
17) చీకటి లో ఫోటోలు తీయడానికి, గోడలపై ఉన్న చిత్రాలను తొలగించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి.?
జ : పరారుణ కిరణాలు
18) ఫింగర్ ప్రింట్ విశ్లేషణకు, దొంగ నోట్లు, దొంగ డాక్యుమెంట్లను గుర్తించడానికి ఉపయోగించి కిరణాలు ఏవి.?
జ : అది నీలలోహిత కిరణాలు
19) సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలలో సూర్యుడు ఎర్రగా, మధ్యాహ్న సమయంలో తెల్లగా కనిపించడానికి కారణమైన కాంతి ధర్మం ఏమిటి.?
జ : కాంతి పరిక్షేపణం
20) హలోగ్రఫీ కనుగొన్నందుకు 1971లో ఏ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించింది.?
జ : గాబర్