BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 23rd JULY
DAILY GK BITS IN TELUGU 23rd JULY
1) భారత జాతీయ గీత ఆలాపన ఎన్ని సెకండ్లలో పూర్తి చేయాలి.?
జ : 56 సెకండ్లు
2) నగర పాలక సంస్థ అధిపతి ఎవరు.?
జ : మేయర్
3) లోక్ సభలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు సభా కార్యక్రమాలను ఎవరు నిర్వహిస్తారు.?
జ : ప్యానెల్ స్పీకర్
4) పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధన రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో ఉంది.?
జ : 10వ
5) భారతదేశంలో అత్యంత పురాతన పార్టీ ఏది.?
జ : భారతీయ కాంగ్రెస్ పార్టీ
6) భారత రాజ్యాంగంలో మద్యపాన నిషేధం గురించి వివరించే నిబంధన ఏది.?
జ : ఆదికరణ 47
7) భారత ఉపరాష్ట్రపతి తొలగించే తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి.?
జ : రాజ్యసభ లో
8) పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు.?
జ : స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ఎన్నికల సంఘం
9) జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది.?
జ : 1974
10) ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యే కాలుష్య ఉద్గారాలను తగ్గించడానికి కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం పేరు ఏమిటి.?
జ : క్యోటో ప్రోటోకాల్
11) ఒక నీటి సరస్సు నీటిలోని పోషకాల కారణంగా వృద్ధాప్యానికి చేరుకునే స్థితిని ఏమంటారు.?
జ : యూట్రోపికేషన్
12) ఏ అటవీ విధానము ద్వారా దేశంలో 33% అడవులను కలిగి ఉండాలని ప్రతిపాదించారు.?
జ : జాతీయ అటవీ విధానం 1988
13) భూ ఉష్ణోగ్రతలు పెరగటానికి ప్రధాన కారణమైన గ్రీన్ హౌస్ వాయువు ఏది.?
జ : కార్బన్ డై ఆక్సైడ్
14) తెలంగాణలో ప్రవహించే మంజీరా నది ఏ నదికి ఉపనది.?
జ : గోదావరి
15) ప్రపంచంలో అతిపెద్ద జనావాస నదీతీర ద్వీపం ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర
16) భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఏది?
జ : ఊలర్ సరస్సు
17) భారత రాజ్యాంగం ప్రకారం కేంద్రా రక్షణ దళాలపై అత్యున్నతాధికారం ఎవరికి కట్టబెట్టబడింది.?
జ : రాష్ట్రపత
18) 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా శాతం ఎంత.?
జ : 31 శాతం
19) భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది .?
జ : 1885
20) సత్యశోదక్ సమాజం స్థాపించినది ఎవరు.?
జ : జ్యోతిరావు పూలే