BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU 18th JULY
DAILY GK BITS IN TELUGU 18th JULY
1) ఇండియన్ మాకియావెల్లి అని ఎవరిని పిలుస్తారు.?
జ : కౌటిల్యుడు
2) అశోకుడు శాసనాల మీద కనిపించే భాష ఏది?
జ : ప్రాకృతం, గ్రీక్, అరబిక్
3) భారత దేశంలో మొదటి సంస్కృత శాసనం ఏది.?
జ : జునాఘడ్ శాసనం
4) అశోకుడు కళింగ యుద్ధం చేసిన సంవత్సరం ఏది.?
జ : క్రీ.పూ. 261
5) దేవనాంప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు గల మౌర్య రాజు ఎవరు.?
జ : అశోకుడు
6) తన శాసనాలు ద్వారా ప్రజలతో నేరుగా సంభాషించిన మొదటి భారత చక్రవర్తి ఎవరు.?
జ : ఆశోకుడు
7) అశోకుడు శాసనాల్లో చెప్పిన కేరళ పుత్రులు ఎవరు.?
జ : చేరులు
8) మౌర్య వంశంలో చివరి పాలకుడు ఎవరు.?
జ : బృహద్రుదుడు
9) తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాల పట్టణం అని దేనికి పేరు.?
జ :- అలంపూర్
10) కొండగట్టు ఆలయాన్ని నిర్మించినది ఎవరు.?
జ :- మొదటి సింగమ సంజీవుడు
11) కేంద్ర ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వేర్వేరుగా జాతీయ షెడ్యూల్డ్ తెగల, కులాల కమిషన్లను రూపొందించింది?
జ :- 89వ రాజ్యాంగ సవరణ చట్టం
12) కేంద్ర ప్రభుత్వం రాజేందర్ సింగ్ సచార్ కమిటీని ఏ అంశంపై ఏర్పాటు చేసింది?
జ :- ముస్లింల స్థితిగతులను పరిశీలించడానికి
13) భారత రాజ్యాంగంలో ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ వాటిని ఎక్కడ పొందుపరిచారు?
జ : సమానత్వపు హక్కులో
14) విద్యుత్ ఫ్యూజ్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది.?
జ : జౌల్ ఫలితం
15) ఘటాలు రసాయన శక్తిని ఏ శక్తిగా మారుస్తాయి.?
జ : విద్యుత్ శక్తి
16) స్వచ్ఛమైన నీరు విద్యుత్ పరంగా ఏ విధంగా పనిచేస్తుంది.?
జ : విద్యుత్ బంధకం
17) రజాకార్లు హత్య చేసిన సోయబుల్లా ఖాన్ ఏ పత్రిక సంపాదకుడు.?
జ : ఇమ్రోజ్
18) భారతదేశంలో మొట్టమొదటి బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు.?
జ : జల్‌భారీ – పంజాబ్
19) దేశంలో సముద్ర తరంగాల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న రాష్ట్రం.?
జ : గుజరాత్
20) సాంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు.?
జ : 1992