DAILY G.K.BITS IN TELUGU MAY 8th

DAILY G.K.BITS IN TELUGU MAY 8th

1) భారతదేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ ఉత్పత్తి ఎంత శాతం.?
జ : 3%

2) భూమికి, సముద్ర తీరానికి మద్య గల సరిహద్దును ఏమంటారు.?
జ : ఖండతీరపు అంచు

3) మిశ్రమ లోహం ఇప్పటిలో ఉండే లోహ అనుఘటకాలు ఏవి.?
జ : రాగి & జింక్

4) అత్యధిక విద్యుత్ వాహకతను ప్రదర్శించే లోహం ఏది.?
జ : వెండి

5) ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు ఏ రుతుపవనా కాలాల ద్వారా అత్యధిక లబ్ధి చేకూరుతుంది.?
జ : నైరుతి రుతుపవనాలు

6) ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఎప్పటి వరకు సాధించాలని నిర్ణయించుకున్నారు.?
జ : 2030

7) శరీరంలో ఆమ్ల, క్షార స్థితిని తటస్థంగా ఉంచుటలో ముఖ్య భూమిక పోషించు ఖనిజాలు ఏవి.?
జ : సోడియం & పొటాషియం అయానులు

8) బంగాళాదుంప చిప్స్ ఆక్సీకరణానికి లోను కాకుండా ఉండటానికి ఏ వాయువును నింపి ప్యాకింగ్ చేస్తారు.?
జ : నైట్రోజన్

9) నెయిల్ పాలిష్ రిమూవర్ లో ఉపయోగించే రసాయనము ఏమిటి.?
జ : ఎసిటోన్

10) ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం ఏ సంస్థ విడుదల చేస్తుంది.?
జ : ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కార నెట్వర్క్

11) హాస్యం సభ్య దేశాల సంఖ్య ఎంత.?
జ : 10

12) సింధు ప్రజల లిపిని ఏమని పిలుస్తారు.?
జ : సర్పలేఖనం

13) సింధు నాగరికతకు హరప్పా నాగరికత అని పేరు పెట్టినది ఎవరు.?
జ : దయారాం సాహ్ని

14) భారతదేశంలో అత్యధిక తలసరి గృహ వినియోగ విద్యుత్ ఉన్న రాష్ట్రం ఏది.?
జ : పంజాబ్

15) ఆదేశిక సూత్రాలలో పేర్కొన్న ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది.?
జ : గోవా