DAILY CURRENT AFFAIRS IN TELUGU 3rd MAY 2023

1) బ్రిటిష్ ప్రభుత్వం అందించే “భారత్ గౌరవ్ అవార్డు 2023” కు ఎంపికైన హైదరాబాదు వాసి ఎవరు.?
జ : డా. అజయ్ అగర్వాల్

2) ప్రపంచ బ్యాంక్ నూతన అధ్యక్షుడిగా జూన్ 2న బాధ్యతలు స్వీకరించనున్న ప్రవాస భారతీయుడు ఎవరు?
జ : అజయ్ బంగ

3) కోల్ ఇండియా సిఎండిగా నియమితులైన తెలుగు వ్యక్తి ఎవరు.?
జ : పీఎం ప్రసాద్

4) 180 దేశాల జాబితాలో “మీడియా స్వేచ్ఛ సూచి – 2023” లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 161 (2022 లో 150)

5) ఆసియాలోనే అతిపెద్ద చర్చి ఎక్కడ ప్రారంభం కానుంది.?
జ : వరంగల్

6) ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అత్యంత పారితోషికం తీసుకుంటున్న క్రీడాకారుల జాబితా లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు.?
జ : 1. క్రిస్టియనో రోనాల్డో, 2. మెస్సీ, 3. ఎంబాపె

7) ఎస్&పీ నివేదిక ప్రకారం భారత సేవల రంగం ఎంత అభివృద్ధిని (పీఎంఐ) నమోదు చేసింది.? 13 సంవత్సరాలలో ఇదే గరిష్ట వృద్ధి.
జ : 62.0

8) భారత్ లో మీడియా, వినోద పరిశ్రమ 2022లో 20% వృద్ధి త ఎన్ని లక్షల కోట్లకు చేరింది.?
జ : 2 లక్షల కోట్లు

9) అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను తాజాగా ఎంత శాతం పెంచింది.?
జ : 0.25% (5.25%)

10) కేంద్ర రక్షణ శాఖ సాయుధ బలగాలకు ఇచ్చే ఆహారంలో ఎంత శాతం తృరణ ధాన్యాల తో కూడిన ఆహారాన్ని ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది.?
జ : 30%

11) 180 దేశాల జాబితాలో “మీడియా స్వేచ్ఛ సూచి – 2023” లో మొదటి మూడు స్థానాలలో నిలిచిన దేశాలు ఏవి.?
జ : నార్వే, ఐర్లాండ్, డెన్మార్క్

12) 22వ లా కమిషన్ చైర్మన్ గా ఎవరు ఉన్నారు.?
జ : రితురాజ్ అవస్థి

13) వేదాలను డిజిటలికరణ చేసి కేంద్రం ఇటీవల ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : వేదిక్ హెరిటేజ్ పోర్టల్

14) జాతీయ సైన్స్ దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్‌నెస్