DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 26th MAY 2023

1) ఇన్‌స్టాగ్రామ్ లో 250 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉన్న ఒకే ఒక్క భారతీయుడుగా ఎవరు నిలిచారు. ప్రపంచంలో మూడవ స్థానంలో ఉన్నాడు.?
జ : విరాట్ కోహ్లీ

2) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరగనుంది విజేతకు ఎంత ప్రైజ్ మనీని ఐసిసి ప్రకటించింది.?
జ : 13.22 కోట్లు

3) 2023 – 24 సంవత్సరానికి భారతీయ పరిశ్రమల సమైఖ్య (CII) అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఆర్ దినేష్

4) ఏ దేశపు కరెన్సీ మీద ముద్రించబడిన 400 ఏళ్ల నాటి వృక్షము ఇటీవల నేలకొరిగింది.?
జ : సియోర్రా లియోన్

5) అమెరికా “జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్” చైర్మన్ గా బైడెన్ ఎవరిని ప్రతిపాదించారు.?
జ : సి.క్యూ. బ్రౌన్ (తొలి నల్లజాతియుడిగా రికార్డు)

6) షార్జా మాస్టర్స్ చెస్ టైటిల్ – 2023 గెలుచుకున్న భారత చెస్ క్రీడాకారుడు ఎవరు.?
జ : అర్జున్ ఇరిగేశి

7) “చైల్డ్ రైట్స్ అండ్ యు” సంస్థ విడుదల చేసిన ” మిస్సింగ్ చైల్డ్ హుడ్” నివేదిక ప్రకారం దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా పిల్లలు మిస్ అవుతున్నారు.?
జ : మధ్యప్రదేశ్

8) లండన్ లోని బొనహమ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ సంస్థ టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని వేలం వేయగా ఎంతకు అమ్ముడుపోయింది.?
జ : 143 కోట్లు

9) సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నూతన డైరెక్టర్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : ప్రవీణ్ సూద్

10) ప్రపంచంలోనే అతి పెద్ద పాట (138.41.02 గంటల పాటు జగదీష్ పిళ్ళై ఆలపించారు) పాటగా ఏ భారతీయ ఇతిహాసం గిన్నిస్ రికార్డులలోకి ఎక్కింది.?
జ : రామచరితమానస్ (తులసీదాస్ రచన)

11) స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు పక్షవాతం వచ్చిన అవయవాల కదలిక కోసం కనిపెట్టిన బ్రెయిన్ ఇంప్లాంట్స్ పేరు ఏమిటి.?
జ : వైర్‌లెస్ డిజిటల్ బ్రిడ్జి

12) అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇటీవల పొందిన బీచ్ ఏది.?
జ : ఋషికొండ (విశాఖపట్నం)

13) అమెరికా రక్షణ శాఖ ఏ దేశంలో ఇటీవల నాలుగు రక్షణ స్థావరాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.?
జ : పిలిఫిన్స్

14) “క్వీన్ ఆఫ్ రాక్ అండ్ రోల్” గా పేరుగాంచిన ఏ సింగర్ ఇటీవల మరణించారు.?
జ : టీనా టర్నర్

15) ఏ వృక్షాన్ని ఇటీవల బోటనిస్టులు కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ లో కనుగొన్నారు. ఈ వృక్షం గురించి ఎడిన్‌బర్గ్ జర్నల్ ఆఫ్ బోటనీ లో ప్రచురించారు.?
జ : మియోజైన్ అరుణాచలేసిస్

16) ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తన రాష్ట్రాన్ని పూర్తి ఈ – గవర్నెన్స్ రాష్ట్రంగా ప్రకటించారు.?
జ : కేరళ (పినరయి విజయన్)

17) నరేంద్ర మోడీ “టీబీ (క్షయ) ఫ్రీ ఇండియా” లక్ష్యాన్ని ఎప్పటికల్లా చేరుకోవడానికి కార్యక్రమాన్ని ప్రారంభించారు.?
జ : 2025

18) భారత్ ముద్రితమవుతున్న ఏ చైనా భాష న్యూస్ పేపర్ ను మూసివేస్తున్నట్లు ఇటీవల ఆ సంస్థ ప్రకటించింది.?
జ : SEONG POW

19) ఐపీఎల్ 2023వ సీజన్ లో మూడవ సెంచరీ నమోదు చేసిన బ్యాట్స్ మెన్ ఎవరు.?
జ : శుభమన్ గిల్

20) మూడవ ఖతార్ ఎకనామిక్ ఫోరం – 2023 సదస్సు ఎక్కడ జరిగింది.?
జ : దోహ