DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 23rd MAY 2023

1) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కడప జిల్లాకు చెందిన సాహితీవేత్త ఇటీవల మరణించారు. ఆయన ఎవరు.?
జ : కేతు విశ్వనాథ రెడ్డి

2) ఐపీఎల్ 2023 లో ఫైనల్ చేరడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నిసార్లు ఫైనల్ చేరిన జట్టుగా రికార్డు సృష్టించింది.?
జ : 10 సార్లు

3) మే 29న ఇస్రో నావిక్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఏ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ ఉపగ్రహం ఉపయోగపడనుంది.?
జ : నావిగేషన్ సిస్టం

4) తొలిసారి సౌదీ అరేబియాకు చెందిన మహిళ అంతరిక్షంలో ప్రయాణించింది. ఆమె ఎవరు.?
జ : రయ్యన్నావ్ బర్నవీ

5) ప్రపంచ పర్యావరణ – జల వనరుల సదస్సు – 2023 ఎక్కడ జరిగింది.?
జ : హెండర్సన్ (అమెరికా)

6) తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు ప్రపంచ పర్యావరణ జల వనరుల సదస్సు సందర్భంగా “ఎడ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రొగ్రెస్” అవార్డు దక్కింది.?
జ : కాళేశ్వరం ప్రాజెక్టు

7) కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : డీకే శివకుమార్

8) కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు.?
జ : ఎస్పి సింగ్ బఘెల్

9) 23వ సంవత్సరంలో జరిగే 37వ జాతీయ క్రీడలలో ఏ క్రీడను నూతనంగా ప్రవేశపెట్టారు.?
జ : గట్కా

10) బ్రిటిష్ కాలం నాటి రెండు లక్షల ఎకరాల చుక్కల భూములను రైతులకు అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది.?
జ : ఆంధ్రప్రదేశ్

11) ఏ జట్టు 27వ “లా లీగా” టైటిల్ను గెలుచుకుంది.?
జ : ఎఫ్.సి. బార్సిలోనా

12) “సుప్రీంకోర్టు ఆన్ కమర్షియల్ అర్బిట్రేషన్” పుస్తక రచయిత ఎవరు.?
జ : డా. మనోజ్ కుమార్

13) యుథోనేషియా కు న్యాయపరమైన గుర్తింపును ఇచ్చిన యూరోపియన్ దేశం ఏది.?
జ : పోర్చుగల్

14) సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి.?
జ : HIM