DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th MAY 2023

DAILY CURRENT AFFAIRS IN TELUGU 18th MAY 2023

1) కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.?
జ : సిద్ధ రామయ్య

2) కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా రిలీజ్ స్థానంలో ఎవరు నియమితులయ్యారు.?
జ : అర్జున్ సింగ్ మేఘ వాల్

3) కేంద్ర నూతన భూ విజ్ఞాన శాఖ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : కిరణ్ రిజీజ్

4) ఐపీఎల్ లో హైదరాబాద్ తో మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేశాడు. ఇది ఐపీఎల్ లో అతనికి ఎన్నో సెంచరీ.?
జ : ఆరవ సెంచరీ

5) ఎయిర్ పోర్ట్ కౌన్సిల్ “ఆసియా పసిఫిక్ గ్రీన్ అవార్డును” ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇచ్చింది.? ఈ విమానాశ్రయం వరుసగా ఆరోసారి ఈ అవార్డును గెలుచుకుంది.?
జ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్)

6) అమెరికాలోని పోలీస్ డిపార్ట్మెంట్ లో అత్యున్నత స్థాయి అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలి దక్షిణాసియా మహిళగా నిలిచిన ప్రవాస భారతీయురాలు ఎవరు.?
జ : ప్రతిమా భుల్లార్ మాల్గోనోడు

7) ఉక్లా సంస్థ నివేదిక ప్రకారం నెట్ స్పీడ్ లో మొబైల్ విభాగంలో మరియు ఫిక్స్డ్ బ్రాడ్ బ్యాండ్ విభాగంలో మన దేశ ర్యాంక్ ఎంత.?
జ : మొబైల్ విభాగంలో 60, ఫిక్స్డ్ బ్రాండ్ బ్రాండ్ విభాగంలో 83.

8) ఏ బాక్సర్ కు ఒలంపిక్స్ శిక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల నజరానా ప్రకటించింది.?
జ : నిఖత్ జరీన్

9) ఏ వైద్య పరికరాల ఉత్పత్తి సంస్థ హైదరాబాదులో 3 వేల కోట్ల పెట్టుబడితో హైదరాబాదులో విస్తరించడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : మెడ్ ట్రానిక్

10) బ్రిటన్ రాజుగా ప్రమాణ స్వీకారం చేసిన చార్లెస్ – ౩ ఎన్ని దేశాలకు రాజుగా కొనసాగుతారు.?
జ : 14 కామన్వెల్త్ దేశాలు

11) ఆసియాలో అత్యంత వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న దేశంగా ఏ దేశం నిలిచింది.?
జ : పాకిస్తాన్

12) నీటి నిర్వహణలో జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా జలశక్తి అవార్డును అందుకున్న తెలంగాణలోని గ్రామపంచాయతీ ఏది.?
జ : జగన్నాధపురం

13) లడఖ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏ పేరుతో ప్రారంభించింది.?
జ : TREES FOR LIFE

14) న్యూయార్క్ లో జరిగిన ఒకవేళ ఇటీవల 315 కోట్లకు అమ్ముడుపోయిన పురాతన బైబిల్ ఏది?
జ : హీబ్రూ బైబిల్

15) ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం అయినా ”చేవిలీయర్ డీ లా లేజియన్ డీ’హనర్” పురస్కారం దక్కించుకున్న భారతీయుడు ఎవరు?
జ : టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్

16) పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేరుతో నగదు బహుమతులను ప్రకటించింది.?
జ : జగనన్న ఆణిముత్యాలు