CURRENT AFFAIRS IN TELUGU 11th FEBRUARY 2023

CURRENT AFFAIRS IN TELUGU 11th FEBRUARY 2023

1) బోర్డర్ గవాస్కర్ ట్రోపి 2023లో మొదటి టెస్టు ఏ జట్టు గెలిచింది.?
జ : ఇండియా(ఆస్ట్రేలియా పై)

2) భారతదేశం లో అతిపెద్ద మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్ ను ఎక్కడ ప్రారంభించారు.?
జ : హైదరాబాద్

3) ఇటీవల భారత్ లో ఎక్కడ అతిపెద్ద లిథియం ఖనిజ నిక్షేపాలను (5.9 మి. ట.)కనుగొన్నారు.?
జ : రియాసి జిల్లా (జమ్మూకాశ్మీర్)

4) రూపే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ చెల్లింపులు ప్రారంభించిన ఫిన్‌టెక్ సంస్థ ఏది.?
జ : మోబీక్విక్

5) జాతీయ సాంస్కృతిక మహోత్సవం 2023కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది.?
జ : ముంబై

6) ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (IISc) ఏ సంస్థతో R&D విభాగంలో ఒప్పందం చేసుకుంది.?
జ : శాంసగ్

7) ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్టులకు ఇచ్చే రాజ రామ్మోహన్ రాయ్ నేషనల్ అవార్డు – 2023 కు ఎవరు ఎంపికయ్యారు.?
జ : ఎబీకే ప్రసాద్

8) శాస్త్ర విజ్ఞానంలో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : ఫిబ్రవరి – 11

9) భారతదేశం భూకంప ప్రభావిత టర్కీ కి ఏ పేరుతో సహయం అందిస్తుంది.?
జ : ఆపరేషన్ దోస్త్

10) దేశంలో మొదటి సారి కేరళకు చెందిన ట్రాన్స్‌జెండర్ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చాడు. అతని పేరు ఏమిటి.?
జ : జహద్

11) అర్జెంటీనా మంత్రి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఇటీవల ఏ ప్రముఖ ఆటగాడి ఆటోగ్రాఫ్ తో కూడిన జెర్సీ ని బహమతిగా ఇచ్చారు.?
జ : లియోనల్ మెస్సీ జెర్సీ

12) ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభం కానున్న గ్రీన్ హైడ్రజన్ తో నడిచే రైలు ఏ రెండు పట్టణాల మద్య నడవనుంది.?
జ : కల్కా – సిమ్లా

13) కెనరా బ్యాంకు సీఈఓ మరియు ఎండీగా ఎవరు నియమితులయ్యారు.?
జ : కే.సత్యనారాయణ రాజు

14) ప్రపంచంలో 10,000 అడుగులతో అతిపెద్ద హైవే టన్నెల్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లలో చోటు సంపాదించిన టన్నెల్ ఏది.?
జ : అటల్ టన్నెల్

15) వాట్సప్ ద్వారా పుడ్ డెలివరీ చేయడానికి భారతీయ రైల్వే ప్రారంభించిన యాప్ పేరు ఏమిటి.?
జ : జూప్

Comments are closed.