ST CAST – జాబితాలోకి 11 కులాలు

హైదరాబాద్ (ఫిబ్రవరి – 11) : తెలంగాణలో షెడ్యుల్డ్ ట్రైబ్స్ (ST) జాబితాలో మరో 11 కులాలను చేర్చాలని అసెంబ్లీ తీర్మానించింది (11 casts included in st list in telangana) . ఈమేరకు శుక్రవారం సభలో ముఖ్యమంత్రి కేసీర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

‘వాల్మీకి బోయ, బేడర్, కిరాతక, నిషాద్, పెద్ద బోయలు, తలయారి, చుండువాళ్లు, కాయితి లంబాడాలు, భాట్ మధురాలు, చమర్ మధురాలను ఎస్టీలుగా గుర్తించాలన్న ఎస్టీ విచారణ సంఘం 2016లో ఇచ్చిన సిఫారసులను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఆ ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి సమర్పించింది. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందనా రాలేదు. అందుకే ఈ సామాజిక వర్గాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.