COVID VACCINATION CERTIFICATE IN WHATSAPP

BIKKI NEWS : కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇప్పుడు మీరు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ మీ వాట్సప్ లోనే పొందే అవకాశాన్ని (COVID VACCINATION CERTIFICATE IN WHATSAPP) కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

దీని కోసం మీరు ఒక నంబర్ ని మీ మొబైల్ లో సేవ్ చేసుకోహవాలి.

+91 90131 51515

తదనంతరం మీరు వాట్సాప్ యాప్ లోకి వెళ్లి ఆ నంబర్ ఓపెన్ చేసి Covid Certificate అని మెసేజ్ చేయాలి.

తర్వాత మీ మొబైల్ నంబర్ కు 6 అంకెల ఓటీపి వస్తుంది. దానిని కూడా వాట్సప్ లో సెండ్ చేయాలి.

తర్వాత మీ మొబైల్ నంబరు తో ఎంతమంది వ్యాక్సినేషన్ వేయయించుకున్నారో వారి పేర్లు వస్తాయి.

వాటిలో మీకు ఎవరి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కావాలో వారి సీరియల్ నంబర్ సెండ్ చేస్తే 30సెకండ్ వలో మీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ pdf పైల్ రూపంలో మీకు వస్తోంది.