అమర వీరుల స్థూపం వద్ద కాంట్రాక్టు లెక్చరర్ ల సంబురాలు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మ 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించగానే 20 ఏళ్లకు పైగా క్రమబద్దీకరణ కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ కమిషనరేట్ కార్యాలయం నందు మరియు అమరవీరుల స్తూపం వద్ద భారీ ఎత్తున తరలివచ్చి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతోపాటు స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కష్టానికి ఫలితం దక్కిందని తమ కష్టాన్ని గుర్తించి తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమాలలో గాదె వెంకన్న, కుమార్, కడారి శ్రీనివాస్, మాలతి, శోభన్, రహీం, ఆంజనేయులు, శ్రీపతి సురేష్ బాబు, పరశురాం, తదితర అధ్యాపకులు భారీ ఎత్తున పాల్గొన్నారు

Follow Us @