Jobs – కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 64 కాంట్రాక్టు ఉద్యోగాలు

BIKKI NEWS (FEB. 29) : కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో భాగంగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో 64 పోస్టులను భర్తీ (contract and out sourcing jobs in KUMURAM BHEEM ASIFABAD district) చేయడానికి నోటిఫికేషన్ జారీచేసింది.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 11 వ తేదీ లోపు ప్రత్యక్ష పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు : మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, రిప్రిజిరేటర్ మెకానిక్, పీడియాట్రిషన్, కోల్డ్ చైన్ మేనేజర్, MLHP, సైక్రియాటిస్ట్, ఫిజియోథెరఫిస్ట్, STLS, డీఈవో కమ్ ఎకౌంటెంట్, ఫిజీషియన్/మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్, RBSK మెడికల్ ఆఫీసర్ (మేల్ & ఫీమేల్), ఆఫ్టోమెట్రిస్ట్, సపోర్టింగ్ స్టాఫ్.

అర్హతలు : పోస్టును అనుసరించి – MBBS, MD, GNM, BSC NURSING, బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, BE, BTECH, MCA, PGDCA, డిగ్రీ ఇంటర్మీడియట్, పదో తరగతి, ఐటీఐ.

వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

ఎంపిక విధానం : 90 మార్కుల రాత పరీక్ష, 10 మార్కులు వయస్సుకు

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో, వెబ్సైట్ నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని దృవపత్రాలు జతపరిచి అందజేయాలి.

దరఖాస్తు గడువు : ఫిబ్రవరి – 28 నుండి మార్చి – 11వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు

చిరునామా : DMHO, F25 బ్లాక్, IDOC కాంప్లెక్స్, ఆసిఫాబాద్

నోటిఫికేషన్ : Download pdf

వెబ్సైట్ : ASIFABAD DISTRICT WEBSITE