BIKKI NEWS : Chandrayaan 3 in numbers and statistics. హలివుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో మేటి దేశాలకు సాధ్యం కాని చంద్రుని దక్షిణ దృవాన్ని చేరుకుంది. మొత్తం మీద చంద్రుని పై అడుగుపెట్టిన 4వ దేశం భారత్… అమెరికా, రష్యా, చైనా లు ఈ జాబితాలో ఉన్నాయి.
పోటీ పరీక్షల నేపథ్యంలో చంద్రయాన్ – 3 గురించి క్లుప్తంగా నేర్చుకుందాం…
Chandrayaan 3 in numbers and statistics
ప్రయోగం తేదీ: 14 జూలై 2023
రాకెట్: LVM3 – M4
వ్యయం: 615 కోట్లు
ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు: 2,145 కిలోలు
ల్యాండర్ బరువు: 1749.86 కిలోలు
రోవర్ బరువు: 26 కిలోలు
ప్రయోగ సమయం: ఒక లూనార్ డే. అంటే భూమిపై 14 రోజులు.
మొత్తం పేలోడ్లు: 7 (ప్రొపల్షన్ మాడ్యూల్ (1), ల్యాండర్ (4), రోవర్ (2)
ప్రొపల్షన్ మాడ్యూల్లో ఇంధనం: 1696 కిలోలు.
రోవర్లో ఉండే పవర్: 50 వాట్స్
LVM3 – M4 లిఫ్ట్ ఆఫ్ మాస్: 642 టన్నులు
LVM3 – M4 రాకెట్ ఎత్తు: 43.5 మీటర్లు
రోవర్ చక్రాలు: 6
చంద్రుడిపై కాలు మోపిన తేదీ: ఆగస్టు 23 – 2023 సాయంత్రం 06.04 గంటలకు