జీవో 317 పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.

BIKKI NEWS (JULY 11) : Cabinet sub committee meeting on 317 go issue.రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఈ సమావేశంలో క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు.

Cabinet sub committee meeting on 317 go issue

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను సబ్ కమిటీ ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనవి. క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్య/భర్త చేసుకున్న దరఖాస్తులపై కమిటీ సానుకూలంగా నిర్ణయం తీసుకుంది.

క్యాబినెట్ సబ్ కమిటీకి చేసుకున్న దరఖాస్తులను సంబంధిత శాకాధిపతులకు పంపించాల్సిందిగా జిఏడి అధికారులకు క్యాబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. మిగతా దరఖాస్తులను వివిధ శాఖలకు పంపి వాటిని పరిశీలన చేసిన అనంతరం తిరిగి క్యాబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకురావాలని కమిటీ సమావేశంలో నిర్ణయించింది.

క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం లో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు, శివశంకర్ (రిటైర్డ్ IAS), జిఏడి అధికారులు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు